భాగమతి రివ్యూ - 24x7telugunews.com Online Telugu News paper,Latest News,Breaking News

Jan 26, 2018

భాగమతి రివ్యూ

bhagamati review
అందాల అనుష్క అరుంధతి తరువాత వుమెన్ ఓరియెంటెడ్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారిపోయింది. ఏదైనా కథాబలమున్న మహిళా ప్రాధాన్యమున్న చిత్రానికి ముందుగా అనుష్క పేరే మదిలోకి వస్తుంది. దర్శకులు కేవలం అనుష్కను దృష్టిలో ఉంచుకునే సినిమా కథలను రూపొందిస్తున్నారంటే అతిశయిక్తి లేదు. తన ప్రతిభతో అనుష్క ఇలా ఇండస్ట్రీని అలాగే ప్రేక్షకులని ఆకట్టుకుంది. తాజాగా, అనుష్క నటించిన "భాగమతి" ఈ రోజే విడుదలైంది. ఈ సినిమా విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.

భాగమతి:
గతేడాది విడుదలైన బాహుబలి తరువాత అనుష్క నటించిన భాగమతి మళ్ళీ ఈ ఏడాది సందడి చేస్తోంది. తెలుగు, తమిళ, మళయాళ భాషలో హారర్ థ్రిల్లర్ గా విడుదలైంది. ఈ సినిమా ట్రైలర్ కు అలాగే టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.కథ:
నిజాయితీ కలిగిన ఇండియన్ ఎడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్ చంచల పాత్రలో అనుష్క ఒదిగిపోయింది. సంక్షేమ పనులతో బిజీగా ఉండే చంచల ఒక గ్రామాన్ని సందర్శించినప్పుడు ఒక యువనాయకుడి ప్రేమలో పడుతుంది. అనుకోకుండా జైలుకు వెళుతుంది చంచల.
కొంతమంది స్వార్థపూరితమైన రాజకీయనాయకులు ఒక బంగ్లాను ఆక్యుపై చేసుకుంటారు. ఆ బంగ్లాలో ఒక స్త్రీ ఆత్మ తిరుగుతూ ఉంటుంది. భాగమతిని జైలు నుంచి విడుదల చేసి ఆమెని ఆ బంగ్లాలో ఉంచుతారు.ఆ తరువాత ఏం జరుగుతుందనేది ఈ చిత్రంలోని ప్రధాన ట్విస్ట్.

ఈ చిత్రంలో అనుష్క తన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. రుద్రమదేవి, అరుంధతి తరువాత అనుష్క ఇలాంటి భారీ పాత్రలకు తానే సరైన నటి అని మళ్ళీ భాగమతితో ప్రూవ్ చేసుకుంది. ఇటువంటి, కథాబలమైన చిత్రాలకు అనుష్కనే నాయికగా ఎంచుకోవాలని ఈ సినిమా చుసిన ప్రతి ఒక్కరూ కచ్చితంగా భావిస్తారు. మంచి ప్రొడక్షన్ వాల్యూస్ వలన చిత్రం బాగా తెరకెక్కింది. డైరెక్టర్ అశోక్ ఈ చిత్రాన్ని తాను అనుకున్న విధంగా తెరకెక్కించి ప్రేక్షకుల మన్ననలు పొందుతున్నారు.

ఒక్క మాటలో: హారర్ థ్రిల్లర్స్ ని ఇష్టపడేవారు ఈ విభిన్నమైన సినిమాను తప్పక చూడాలి.

Recent Post