Bigg Boss Telugu Episode 22 Highlights - 24x7telugunews.com Online Telugu News paper,Latest News,Breaking News

Aug 7, 2017

Bigg Boss Telugu Episode 22 Highlights

bigg boss telugu episode 22 highlightsఒక ప్రముఖ ఛానల్ లో గత కొంతకాలంగా ప్రసారమవుతున్న మెగా రియాలిటీ షో 'బిగ్ బాస్'కు ప్రేక్షకాదరణ అమితంగా దక్కుతోంది. ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ఈ షో యొక్క ప్రతి ఎపిసోడ్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటోంది. ఈ తరహా రియాలిటీ షోస్ తెలుగు ప్రేక్షకులకు కొత్తే. కాబట్టి రేటింగ్స్ పరంగా ఈ షో అదరగొట్టేస్తోందన్న వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇందులో పార్టిసిపేట్ చేస్తున్న కంటెస్టెంట్స్ షో ప్రారంభమైన మొదటి రోజు ముఖానికి అందమైన నవ్వు పులుముకుని విపరీతంగా యాక్టింగ్ చేసేసినా ఆ తరువాత బిగ్ బాస్ సృష్టిస్తున్న కాంఫ్లిక్ట్స్ కి తమలోని నిజమైన 'తమ'ని బయటపెట్టాల్సి వస్తోంది. కొన్ని స్నేహాలు, కొన్ని ద్వేషాలకి బిగ్ బాస్ షో వేదికయింది. 
మరే డైలీ సీరియల్లో కూడా ఇటువంటి భావోద్వేగాలు లభించవని సదరు సీరియల్స్ చూస్తున్న మహిళా ప్రేక్షకులు ముచ్చటించుకుంటున్నారు. ఈ షోలో పాల్గొంటున్న కంటెస్టెంట్స్ కు బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్స్ పోటీదారుల మధ్య పోటీతత్వాన్ని మరింత పెంచే విధంగా ఉన్నాయి. కాగా, ఇప్పటి వరకు జ్యోతి, మధుప్రియ ఈ షో నుంచి ఎలిమినేట్ అయ్యారు. బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు ఈ షో నుంచి వైదొలిగారు. తాజా ఎపిసోడ్ లో సమీర్ ఎలిమినేషన్ కు గురయ్యాడు. 
కాగా ఎలిమినేషన్లో సింగర్ కల్పన పేరు కూడా నామినేట్ అయ్యుండగా ఆమె మాత్రం సేఫ్ జోన్ లో ఉన్నారు. కాగా, ఇప్పటికే కల్పనకు ఇతర కంటెస్టెంట్స్ కు బిగ్ బాస్ హౌస్ లో వ్యతిరేకత ప్రారంభమైన విషయం తెలిసినదే. కాబట్టి, ప్రేక్షకులు కల్పనే ఎలిమినేట్ అవుతుందేమోనని ఊహించారు. అయితే, ఎవరి ఊహకు అందని విధంగా సమీర్ ఎలిమినేట్ అయ్యాడు.

ఈ ఆదివారం ప్రసారమైన ఎపిసోడ్ లో రానా బిగ్ బాస్ హౌస్ ను సందర్శించారు. హౌస్ మేట్స్ అందరికీ తన కొత్త సినెమా 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా విశేషాలను చెప్పుకొచ్చారు. హౌస్ మేట్స్ కూడా రానాతో సరదాగా ముచ్చటిస్తూ బయటి విశేషాలు తెలుసుకోవాలని ప్రయత్నించారు. రానా చమత్కారంగా హౌస్ మేట్స్ తో సంభాషించారు. ప్రపంచంలో తెలుగువారందరూ ఈ షో గురించే మాట్లాడుకుంటున్నారని రానా బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి తెలిపారు. 

Recent Post