దళిత్ వెర్సెస్ దళిత్ ...రక్తి కట్టిస్తున్న రాష్ట్రపతి ఎన్నిక - 24x7telugunews.com Online Telugu News paper,Latest News,Breaking News

Jun 24, 2017

దళిత్ వెర్సెస్ దళిత్ ...రక్తి కట్టిస్తున్న రాష్ట్రపతి ఎన్నిక


meira kumarదళిత్  కార్డు  ఉపయోగించి రాజకీయాల్ని రక్తి కట్టించే వ్యూహప్రతివ్యూహాల్లో జాతీయ పార్టీలు కదం తొక్కుతున్నాయి. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన రాష్ట్రపతి ఎంపిక ఏకగ్రీవం కావడం కన్నా పంతాలకు పోయి సాధారణ ఎన్నికల అన్ని రాజకీయ పార్టీలు తంతులాగా మార్చేయడం ప్రజాస్వామ్యవాదుల్ని కలవరపెడుతోంది. అత్యధిక మెజారిటీతో, వరస విజయాలతో జోరుమీదున్న మోడీని ఢీ కొనేందుకు జాతీయ స్థాయిలో విపక్షాలకు అందివచ్చిన అవకాశం రాష్ట్రపతి ఎన్నిక. ప్రతిపక్షాలు ఎన్ని ఎత్తుగడలు వేసినా ఎన్డీయే కూటమి అభ్యర్థి రాష్ట్రపతి కావడం భవిష్యత్ సత్యం. అలాగని, చేతులు ముడుచుకుని కూర్చోకుండా కాంగ్రెస్ సారథ్యంలో విపక్షాలు ఐక్యతా వేదికని నిర్మించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. 
ram nath kovind

విపక్షాల ఐక్యతను చెడకొడుతూ... వారి మధ్య చీలిక వచ్చే పన్నాగంలో భాగంగా ముందుగా దళిత్ కార్డు ని ప్రయోగించి వేడుక చూద్దామనుకుంది ఎన్డీయే కూటమి. తొలుత రాజకీయాలతో సంబంధం లేని ఒకట్రెండు పేర్లు ప్రచారంలోకి వచ్చినా ... బీహార్ గవర్నర్  రామనాద్ కోవింద్ ని ప్రకటించడం సంచలంగా మారింది. మోడీ వ్యూహాత్మకంగా దళితుడయిన ఈ మేధావి, న్యాయవాదిని తెరపైకి తీసుకురాగానే విపక్ష శిబిరానికి సెగ తగిలింది. కొంతమంది బాహాటంగా కోవింద్ అభ్యర్థిత్వానికి మద్దతు ఇస్తుంటే... తమతో సంప్రదించకుండా అభ్యర్థిని ప్రకటించారంటూ కాంగ్రెస్ విమర్శిస్తూ లోక్ సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ ని రంగంలోకి దింపడంతో రాజకీయ రసకందాయం చోటు చేసుకుంది. మీరా కుమార్ కి 17 పార్టీల మద్దతు ఉంది.

రాష్ట్రపతి ఎన్నిక గణితం ఇది 

రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి మొత్తం ఓట్ల విలువ 10,98,882 కాగా మెజారిటీ కి కావాల్సిన ఓట్ల విలువ 5,49,453. ఎన్డీఎ అభ్యర్థి రామ్ నాధ్ కోవింద్ ని సపోర్ట్ చేస్తున్న తటస్థ పార్టీల ఓట్ల విలువ 1,08,306. ఎన్డీఎ కూటమికి 5,37,080 ఓట్లు ఉండగా ...యూపీఏ ఓట్ల విలువ 2,13,774. ఎన్డీఏ కూటమి అభ్యర్ధికి మద్దతు ఇస్తారనుకుంటున్న ఓట్ల విలువ 90, 890.. ఏదేమైనా మీరాకుమార్ పేరు విపక్షాలు తెరపైకి తెచ్చేసరికి రాష్ట్రపతి ఎన్నికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఎండీఏ కూటమి అభ్యర్థిగా రామ్ నాధ్ కోవింద్ నామినేషన్లు దాఖలు చేయబోతున్నారు. 

Recent Post