సమంత ... ఏ ట్రూ స్టోరీ - 24x7telugunews.com Online Telugu News paper,Latest News,Breaking News

Apr 28, 2017

సమంత ... ఏ ట్రూ స్టోరీSamatha-ruth-prabhu

తెరపై ఆమె ముగ్ధ స్నిగ్ధ సౌందర్యాలనే చూస్తాం. వయసు వసంతాలు ముగ్ధులవుతాం.  సోయగాలాల్లో చిక్కుకుని ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అవుతాం.  కాటుకలంటిన కళ్ళతో కవ్విస్తుంటే వేడుక చూస్తాం. కాటేసి  చూపుల్తో కాట్ వాక్ చేస్తే హృదయాల్ని వేదిక చేస్తాం. ఇంత చేసినా అదంతా రంగులు ప్రపంచం మాయాజాలం మాత్రమే. లైట్లారిన థియేటర్ లో వీక్షకుల్ని వినోదపరిచే వెలుగు నీడలా క్రీడ మాత్రమే.
మూడక్షరాల సినిమాని రెండున్నర గంటలపాటు చూసే ప్రేక్షకులకు, ఆయా చిత్రాల్లో నటించే తారలకూ బంధం కేవలం థియేటర్ వరకే పరిమితం కాదంటూ ... జగమంతా కుటుంబమనే విశాల భావజాలాన్ని వ్యక్తిత్వ లక్షణంగా చేసుకునే ఆర్టిస్టులూ కొందరుంటారు అచ్చం మన విజయ తార సమంతలా.
కాలాన్ని కరెన్సీ గా మార్చేసి కాసుల వేటలో క్షణక్షణం ఉక్కిరిబిక్కిరవుతూ షూటింగ్ స్పాట్ లో పేకప్ చెప్పే వరకూ మేకప్ లో ఉండే బిజీ తరాలకు సమాజం గురించి పట్టించుకునే తీరిక, కోరికా ఉంటాయా? అంటే ... మనసుంటే మార్గం ఉంటుందని ప్రూవ్  చేసింది సమంత.
అవును...తెరపై  కధ అవసరాల నిమిత్తం కాస్త అందంతో, మరికాస్త అభినయంతో కట్టిపడేసే సమంత రియల్ లైఫ్ లో మనసున్న మారాణి. ఎదుటివారి కస్టాలు, కడగండ్లకు కరిగి ... తనకు చేతనైన రీతిలో చేయూత అందించే కరుణా రస హృదయిని.
సమాజ సమస్యలకు చలిస్తూ, ప్రజల కష్టాలకు స్పందిస్తూ, వాళ్ళ కన్నీళ్లు తుడుస్తూ, ఆపత్సమయాల్లో ఆడుకుంటూ అండగా ఉంటూ వెలుగు జిలుగులు తారాలోకంలో తనదయిన ప్రత్యేకతతో సమంత నిలిచిందంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు.
అసలు పేరు సమంత రుతు ప్రభు. స్క్రీన్ నేమ్   మూడక్షరాల... సమంత. అభిమానులు ఆత్మీయంగా పిలుచుకునే పేరు సామ్స్. సేవా సంస్థ ద్వారా తాను తెచ్చుకున్న పేరు ప్రత్యూష సమంత. పుట్టింది, పెరిగింది తమిళనాడు చెన్నయి లోని పల్లవరం ప్రాంతం. తల్లి మలయాళీ. తండ్రి తెలుగువాడు.
1987 ఏప్రిల్ 28న పుట్టిన సమంతకు ఇద్దరు అన్నలు. హోలీ ఏంజిల్స్ ఆంగ్లో ఇండియన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో ప్రాధమిక విద్యను అభ్యసించిన సమంత ... ఆపై చదువును చెన్నయిలోని స్టెల్లా మేరీస్ కాలేజ్ లో కొనసాగించి బీకామ్ పట్టా పొందారు. సినీ తారగా పేరు తెచ్చుకుంది టాలివుడ్, కోలీ వుడ్ ఇండస్ట్రీలో.
2010లో ఆమె నటించిన ఏ మాయ చేసావే సినిమా ద్వారా వీక్షకులకు హలో చెప్పింది సమంత.
ప్రాణాంతక వ్యాధుల బారిన పడి కొట్టుమిట్టాడుతున్న వారిని ఆదుకునేందుకు  ప్రత్యూష సేవా సంస్థ స్థాపించింది.

Recent Post