ప్రేమాయ నమః - 24x7telugunews.com Online Telugu News paper,Latest News,Breaking News

Feb 14, 2017

ప్రేమాయ నమః

ప్రేమ ... రెండక్షరాలే.
ఒకటి భువనం. రెండు గగనం.
ఒకటి మంచితనం. రెండు మనిషి తనం.
నవజాత శిశువు మొదలుకుని యావత్ ప్రపంచమంతా ప్రేమకు దాసోహం. మాటరాని పశుపక్ష్యాదులు కూడా ప్రేమాప్యాయతలకు కట్టుబడాలసిందే. ప్రేమ లేని ప్రపంచం లేదంటే అతిశయో క్తే.  సంస్కృతీ సంప్రదాయాల  ప్రకారం  ఒక్కో దేశంలో ఒక్కో పండుగ జరుపుకుంటున్నా... ప్రపంచంలోని  జరుపుకునే  ఒకే ఒక్క పండుగ ప్రేమ పండుగ. నిజానికి.. అన్ని  పండుగల్లోనూ   ప్రేమ అంతర్లీనంగా   ఉన్నా  ప్రేమే  ప్రధాన భూమిక పోషించే పండుగ ప్రేమ పండుగ.  జంట కోరే ఒంటరి బతుకులకు పెద్ద ఊరట.
ఫిబ్రవరి 14 వస్తే... జీవితంలోకి వసంతం వస్తుందని పొంగిపోతాయి యువ హృదయాలు.
మనసుకు నచ్చిన ప్రియుడితో, ప్రియురాలితో మనసులో మాట ఏ కారణాల వల్లనో వ్యక్తీకరించలేని స్థితిలో కొట్టుమిట్టాడే యువతని... ఆ స్థితి నుంచి బయటపడేసే ప్రేమోత్సవం ఇది. అంతర్లీనంగా అవ్యక్తభావాలను వ్యక్తీకరించి... ఆ ప్రేమకి పట్టం కట్టే రోజు ఇది.
అందుకే... స్పందించే యువతలో పులకింతలు వేనవేలు.
గోల్డ్ ప్లేటెడ్ రోస్ ఫ్లవర్ 
ఫిబ్రవరి 14నాడు ఏద మెచ్చిన వాలెంటైన్ ముందు నిలువెత్తు గ్రీటింగ్ కార్డు గా మారడం ఓ దివ్యానుభూతి. పులకింతల పుష్పంలా మనస్సు వికసించడం ఓ ఆనందగీతి.
కాలేజీల్లో, క్యాంపస్ ల్లో, కారిడార్లలో,  థియేటర్లలో,  పార్కుల్లో,  పబ్లలో... సందడే సందడి. వాలెంటయిన్ డే సాక్షిగా  ఇచ్చిపుచ్చు కోవడం... ఆ సంతోషాన్ని   ఆనవాయితీ. దాంతో, మన మన్మధుడి పూలబాణాలకి   ఎక్కడ లేని గిరాకీ. ఫ్లవర్ బొకే   చూడండి... ఎలా   కిక్కిరిసి ఉంటాయో? ఇక, గిఫ్ట్ షాపులు, మాల్స్ గురించి వేరే చెప్పాలా? అంతేనా? ప్రేమికుల మది మెచ్చే ఈవెంట్స్ ఎన్నో?
వర్తమాన జమానాలో మారిన చిత్రాలెన్నో?   వాటి లో   టాటూల సంగతి  స్పెషల్ గా చెప్పాల్సిన లేదు.
ఆకులో... ఆకులా...పూవులో పూవులా... ప్రకృతిలో ప్రేమ సందడించడం భాషకందని మధుర స్మృతి.
ప్రపంచం ఇప్పుడో గ్లోబల్ విలేజ్. ఆ వీధిలో అమెరికా.. ఈ వీధిలో ఇండియా ఉన్నాయి. ఇంటింటికీ ఇంటర్నెట్ ప్రపంచాన్ని పల్లెని చేసింది.  అందుకే ... విదేశీ ఫెస్టివల్స్  అవుతున్నాయి. వాటిలో ఫిబ్రవరి 14 లవర్స్ డే   ఒకటి. ఏడాదిలో ఏదో ఒకరోజు ప్రేమోత్సవం జరుపుకోవడం ఏమిటని ముక్కున వేలేసుకునేవాళ్ళు మన మధ్యలోనే ఉన్నారు.  ఆ అభ్యంతరాలను యువత పట్టించుకోవడం లేదు. నిజానికి, మనసులో ఉన్న ప్రేమ వ్యక్తం చేయడానికి ప్రత్యేకించి ఓ రోజు కావాలా? ఆ రోజునే మన ప్రేమను వ్యక్తం చేయాలా? ఇలాంటి ప్రశ్నలు చాలామంది వేస్తున్నా... ప్రేమికుల రోజును అడ్డగిస్తాం ...యాగీ చేస్తాం... అంటూ వీరభక్త హనుమాన్ దళాలు ... ఆందోళనలు చేస్తున్నా ప్రతి ఏడూ ఠంఛన్ గా ఫిబ్రవరి వస్తూనే ఉంది. మన ఇండియాలో... మన స్టేట్ లో .. మన హైదరాబాద్ లో కూడా ప్రేమోత్సవం సందడి చేస్తూనే ఉంది. అంతే కాదు... పుంఖానుపుంఖాలుగా పుట్టిన శతాధిక ఎలక్ట్రానిక్ ఛానెల్స్ లో ఫెబ్ 14 సందడి కూడా తక్కువేం కాదు.
మరిన్ని అప్డేట్స్ కోసం ఫేస్ బుక్ పేజీని లైక్ చేయండి  

Recent Post