ఐటెం సాంగ్ తో దడ పుట్టించనున్న సుమ, అనసూయ? - 24x7telugunews.com Online Telugu News paper,Latest News,Breaking News

Feb 7, 2017

ఐటెం సాంగ్ తో దడ పుట్టించనున్న సుమ, అనసూయ?


సీనియర్ మోస్ట్ యాంకర్ సుమ గత కొన్నేళ్లుగా బుల్లితెరలో తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. దాదాపు ఎన్నో ఏళ్లుగా బుల్లితెరలో యాంకర్ గా కొనసాగుతూ మరోవైపు వెండితెరలో కూడా అడపాదడపా అతిథి పాత్రలలో తళుక్కుమన్న సుమ ఇప్పుడు ఏకంగా ఐటెం సాంగ్ తో వెండితెరలో సంచలనం సృష్టించాలని భావిస్తోందేమోనని విశ్లేషకుల అంచనా. ఆడియో ఫంక్షన్స్ లో పాటలు పాడుతూ అటు మ్యూజిక్ డైరెక్టర్స్ కి తాను సింగర్ గా కూడా పనికొస్తానంటూ హింట్ ఇచ్చిన సుమకి ఎట్టకేలకు థమన్ అవకాశం ఇచ్చాడు. ఈ పాటలో హాట్ యాంకర్ అనసూయ, సాయి ధరమ్ తేజ్ కి జోడీగా నర్తించింది. సుమలో దాగున్న ఈ టాలెంట్ ని వెలుగులోకి తెచ్చిన థమన్ ని ఎంతో మంది అభిమానులు మనస్సులోనే అభినందనలు తెలుపుకుంటున్నారు.

Recent Post