ఆ హీరోతో అంజలి లవ్ జర్నీని కన్ఫర్మ్ చేసిన దోశ? - 24x7telugunews.com Online Telugu News paper,Latest News,Breaking News

Feb 9, 2017

ఆ హీరోతో అంజలి లవ్ జర్నీని కన్ఫర్మ్ చేసిన దోశ?

Jai_anjali_dosa_challenge

ఇప్పుడు కోలీవుడ్ సోషల్ మీడియా దోశ ఛాలెంజ్ తో తెగ బిజీగానుంది. జ్యోతిక నటించిన 'మగలిర్‌ మట్టుమ్‌' సినిమా ప్రమోషన్లో భాగంగా దోశ ఛాలెంజ్ ని హీరో సూర్య తెరమీదకు తీసుకువచ్చాడు. ఇందులో భాగంగా హీరో సూర్య తన భార్య జ్యోతికకు దోశను వేసిచ్చాడు. 
ఇదిలా ఉంటే, ఈ ఛాలెంజ్ ను స్వీకరించిన కోలీవుడ్ హీరో జై, ప్రేమతో దోశను వేసి అంజలికిచ్చాడు. అంతే, కోలీవుడ్ మీడియా మొత్తం అంజలి, జై మధ్య లవ్ జర్నీ గురించి తెగ వార్తలు రాసేస్తోంది. మళ్ళీ, ఇలా ఒక దోశ వీరిద్దరి ప్రేమాయణాన్ని లైమ్ లైట్ లోకి తీసుకువచ్చింది. 
కాగా, అచ్చతెలుగమ్మాయి అంజలి మొదటి సినిమా 'ఫోటో'. ఆ తరువాత చెన్నై లో లక్ టెస్ట్ చేసుకుని తిరిగి టాలీవుడ్ లో రీ-ట్రీ ఇచ్చిన అంజలి 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' ఇచ్చిన హిట్ తో కెరీర్ ఆశాజనకంగా ఉంటుందనుకున్నా టాలీవుడ్ లో అంజలిని అవకాశాలు పలకరించడం లేదు. దాంతో, మళ్ళీ చెన్నై బాట పట్టింది సుందరి. 

మరిన్ని అప్డేట్స్ కోసం ఫేస్ బుక్ పేజీని లైక్ చేయండి 

Recent Post