తెలుగు ఛానల్స్ లో ప్రోమో టెర్రర్స్ - 24x7telugunews.com Online Telugu News paper,Latest News,Breaking News

Feb 13, 2017

తెలుగు ఛానల్స్ లో ప్రోమో టెర్రర్స్


సాధారణంగా ఛానల్స్ నుంచి జనాలు కాస్తంత ఎంటర్టైన్మెంట్ తో పాటు న్యూస్ అప్డేట్స్ ను ఆశిస్తారు. కానీ ఈ మధ్య కాలంలో చాలా ఛానల్స్ వారు నిర్వహించే 'ప్రత్యేక' ప్రోగ్రామ్స్ ల ప్రోమోస్ ను టెలికాస్ట్ చేసేందుకే ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నాయి. ఒక గంట పాటు ప్రసారమయ్యే ప్రోగ్రాంకు చెందిన ప్రోమోను పదే పదే ప్రసారం చేయడం వల్ల విసిగి వేసారిపోయిన సగటు ప్రేక్షకుడు ఏ మందులకు లొంగని తలనొప్పితో విలవిలలాడుతున్నాడు. ఎంత ఇంటరెస్టింగ్ గా ఉన్నా ప్రోమోస్ ను పదే పదే ప్రసారం చేస్తూ అసలు ప్రోగ్రాంపై ఆసక్తిని కోల్పోతున్నాడన్న విషయం ఛానల్స్ గ్రహించాలని విశ్లేషకులు ఆశిస్తున్నారు. సగటు ఛానల్స్ వారు సదరు ప్రేక్షకుడి సహనంతో ఆటలాడుకుంటున్నారు. మరి, మితిమీరిన 'ప్రోమో టెర్రర్' నుంచి ప్రేక్షకులకు విముక్తి కలగదా? కలుగుతుందనే భావిస్తున్నాడు సగటు ప్రేక్షకుడు.
మరిన్ని అప్డేట్స్ కోసం ఫేస్ బుక్ పేజీని లైక్ చేయండి  

Recent Post