అమెరికాలో తెలంగాణ యువకుడి దారుణహత్య - 24x7telugunews.com Online Telugu News paper,Latest News,Breaking News

Feb 12, 2017

అమెరికాలో తెలంగాణ యువకుడి దారుణహత్య

Indian Youngster Shot Dead In USA

అమెరికాలో జాతివివక్షకు ఓ తెలంగాణ  యువకుడు బలయ్యాడు.  ఆ యువకుడి పేరు వంశీ చందర్ రెడ్డి మామిడాల. ఈ తెలుగు యువకుడు అమెరికాలోని మాస్టర్స్ పూర్తి చేసి ఓ పక్క సాఫ్ట్ వేర్ జాబ్స్ వెతుక్కుంటూ మరో పక్క పార్ట్ టైమ్ జాబ్ చేసుకుంటున్నాడు. తన షిఫ్ట్ ముగించుకుని తిరిగి ఇంటికి వస్తుండగా ఓ గుర్తుతెలియని దుండగుడు వంశీ వద్ద పర్సుని, డబ్బుని తీసుకుని కాల్చి పారిపోయాడు. దీంతో వంశీ అక్కడిక్కక్కడే మరణించాడు. 
గత రెండు రోజుల క్రితమే తన తండ్రితో అక్కడి పరిస్థితిని వివరించాడు వంశీ. కొత్తగా ఏర్పాటైన ట్రంప్ ప్రభుత్వం వల్ల అమెరికాలో విదేశీయులను ఐటీ ఉద్యోగాల్లోకి తీసుకోవడానికి సంశయిస్తున్నారని తనతో తన కుమారుడు చెప్పాడని, భయపడవద్దని వెంటనే బయలుదేరి ఇండియా వచ్చేయమని ధైర్యం చెప్పానని ఇంతలో ఇంత ఘోరం జరిగిందని వంశీ తండ్రి మామిడాల మోహన్ రెడ్డి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 
ఈ సంఘటనతో అమెరికాలో ఉంటున్న వారి కుటుంబాల గురించి ఇండియాలో వారి బంధువులు భీతి చెందుతున్నారు. ఇండియాకి తిరిగి వచ్చేయమని ఎంతో మంది తమ వారికి నచ్చచెప్పుకుంటున్నారు.  

Recent Post