24x7telugunews.com Online Telugu News paper,Latest News,Breaking News

Jan 28, 2018

సోషల్ మీడియాపై కేసీఆర్ సంచలన నిర్ణయం


సోషల్ మీడియాలో నోటికొచ్చినట్టు వాగితే ఇకమీదట వారికి జైలే గతి. సోషల్ మీడియాలో ఎవరినైనా తిడితే కంప్లైంట్స్ రాగానే తిట్టిన వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేసేస్తారు. కోర్టు అనుమతి లేకుండానే ఇటువంటి నేరాలను విచారించవచ్చంటూ తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. ఇందుకు సంబంధించిన ఫైల్ పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారు. 
సోషల్ మీడియా అనేది ప్రజలకు ఎంత చెరువులోకి వచ్చిందో ప్రభుత్వాలపై అలాగే వ్యక్తులపై దూషణ అంతే విధంగా తారాస్థాయికి చేరింది. సభ్యత సంస్కారం అలాగే విచక్షణ లేకుండా సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యానాలు చేసే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. ఇటువంటి వారికి ఇప్పుడు గడ్డుకాలమేనని తెలుస్తోంది.

Read More »

Jan 26, 2018

భాగమతి రివ్యూ

bhagamati review
అందాల అనుష్క అరుంధతి తరువాత వుమెన్ ఓరియెంటెడ్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారిపోయింది. ఏదైనా కథాబలమున్న మహిళా ప్రాధాన్యమున్న చిత్రానికి ముందుగా అనుష్క పేరే మదిలోకి వస్తుంది. దర్శకులు కేవలం అనుష్కను దృష్టిలో ఉంచుకునే సినిమా కథలను రూపొందిస్తున్నారంటే అతిశయిక్తి లేదు. తన ప్రతిభతో అనుష్క ఇలా ఇండస్ట్రీని అలాగే ప్రేక్షకులని ఆకట్టుకుంది. తాజాగా, అనుష్క నటించిన "భాగమతి" ఈ రోజే విడుదలైంది. ఈ సినిమా విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.

భాగమతి:
గతేడాది విడుదలైన బాహుబలి తరువాత అనుష్క నటించిన భాగమతి మళ్ళీ ఈ ఏడాది సందడి చేస్తోంది. తెలుగు, తమిళ, మళయాళ భాషలో హారర్ థ్రిల్లర్ గా విడుదలైంది. ఈ సినిమా ట్రైలర్ కు అలాగే టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.కథ:
నిజాయితీ కలిగిన ఇండియన్ ఎడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్ చంచల పాత్రలో అనుష్క ఒదిగిపోయింది. సంక్షేమ పనులతో బిజీగా ఉండే చంచల ఒక గ్రామాన్ని సందర్శించినప్పుడు ఒక యువనాయకుడి ప్రేమలో పడుతుంది. అనుకోకుండా జైలుకు వెళుతుంది చంచల.
కొంతమంది స్వార్థపూరితమైన రాజకీయనాయకులు ఒక బంగ్లాను ఆక్యుపై చేసుకుంటారు. ఆ బంగ్లాలో ఒక స్త్రీ ఆత్మ తిరుగుతూ ఉంటుంది. భాగమతిని జైలు నుంచి విడుదల చేసి ఆమెని ఆ బంగ్లాలో ఉంచుతారు.ఆ తరువాత ఏం జరుగుతుందనేది ఈ చిత్రంలోని ప్రధాన ట్విస్ట్.

ఈ చిత్రంలో అనుష్క తన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. రుద్రమదేవి, అరుంధతి తరువాత అనుష్క ఇలాంటి భారీ పాత్రలకు తానే సరైన నటి అని మళ్ళీ భాగమతితో ప్రూవ్ చేసుకుంది. ఇటువంటి, కథాబలమైన చిత్రాలకు అనుష్కనే నాయికగా ఎంచుకోవాలని ఈ సినిమా చుసిన ప్రతి ఒక్కరూ కచ్చితంగా భావిస్తారు. మంచి ప్రొడక్షన్ వాల్యూస్ వలన చిత్రం బాగా తెరకెక్కింది. డైరెక్టర్ అశోక్ ఈ చిత్రాన్ని తాను అనుకున్న విధంగా తెరకెక్కించి ప్రేక్షకుల మన్ననలు పొందుతున్నారు.

ఒక్క మాటలో: హారర్ థ్రిల్లర్స్ ని ఇష్టపడేవారు ఈ విభిన్నమైన సినిమాను తప్పక చూడాలి.
Read More »

Jan 25, 2018

రంగస్థలం టీజర్ లో సమంత మిస్సింగ్?

rangasthalam teaser

టాలీవుడ్ లో కూడా జెండర్ డిస్క్రిమినేషన్ ఇంకా కొనసాగుతుందన్న విషయం ఎప్పటికప్పుడు రుజువవుతూనే ఉంది. సినిమా ఫస్ట్ లుక్ నుంచి టీజర్స్ వరకు హీరోయిన్స్ గురించి ప్రస్తావన ఉండదు. కేవలం హీరోలపైనే దర్శకనిర్మాతలు ఫోకస్ పెడుతూ ఉంటారు. తాజాగా విడుదలైన సుకుమార్ "రంగస్థలం" టీజర్ లో కూడా హీరోయిన్ జాడ కనిపించదు. ఐతే, కథలోని హీరోయిన్ క్యారక్టర్ ని సస్పెన్స్ గా ఉంచేందుకు ఈ విధమైన థీమ్స్ ని ఎన్నుకుంటారని కొందరి పరిశీలకుల అంచనా. ఏది ఏమైనా సినిమా నుంచి ప్రేక్షకులు ఆశించే ఎంటర్టైన్మెంట్ లభిస్తే ప్రేక్షకులకు ఆనందమే కదా!ట్విట్టర్ లో ఫాలో అవండి - https://twitter.com/24x7telugunews
ఫేస్ బుక్ లో ఫాలో అవండి - https://www.facebook.com/24x7telugunewscom-158992721153991
Read More »

Sep 29, 2017

జస్ట్ ఫర్ ఫన్Read More »

మెహ్రీన్ ఫొటోస్Read More »

దసరా శుభాకాంక్షలు

 దసరా శుభాకాంక్షలు 
- 24x7telugunews Team
Read More »

Sep 25, 2017

బిగ్ బాస్ సీజన్ 1 - విన్నర్ గా నిలిచిన శివబాలాజీ

Bigg Boss Telugu
బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 విజయవంతంగా పూర్తయింది. అసలు, ఈ షో ని తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారా లేదా అనే సంశయంతో ఈ షోని ప్రారంభించిన నిర్వాహకులు ఈ షో కి వచ్చిన అద్భుతమైన క్రేజ్ కి ఆనందాశ్చర్యాలకు గురవుతున్నారు. 16 కంటెస్టెంట్స్ ఈ షోలో పోటీపడగా. వారిలో ఆదర్శ్, నవదీప్, శివబాలాజీ, హరితేజ, అర్చనలు చివరి వారం వరకు ఒకరికొకరు టఫ్ కాంపిటీషన్ ఇచ్చుకున్నారు. ప్రేక్షకాదరణతో శివబాలాజీ ఈ షో విన్నర్ గా నిలిచారు. ఆదర్శ్ రన్నరప్ గా నిలిచారు. మొత్తానికి ఈ షో తెలుగు టీవీ చరిత్రలో ఓ సంచలనం సృష్టించింది. 
Read More »

Cinema and General

Political

Gallery